మనుష్యులలో కొర పన్ను మరియు జ్ఞాన దంతం ఎక్కువగా బోణికెలో ఇరుక్కుంటాయి. ఇవి పేరిగే వయసులో బయటికి రాకుండా బోణికెలోనే ఉండి పోతాయి. ఇతే బోణికెలో ఎక్కడ ఇరుక్కున్నాయి మరియు ఏ స్థితిలో ఉన్నాయో గమనిచటం చాలా కష్టం.
ఇప్పటివరకు వీటికి సాధారణ X-రే మాత్రమే ఉపయోగించి వాటి పరిస్థితిని తెలుసుకునే వారు. కానీ ఇప్పుడు మనకు ఆ బాధ లేదు. మన కాకినాడ పట్టణంలో అధునాతన 3డి డెంటల్ ఎక్స్-రే వచ్చేసింది. ఇది Cone Beam Computed Tomography (సిబిసిటి / CBCT) గా పిలవబడుతున్నది.
ఈమధ్యనే ఒక పేషెంట్ క్లిప్స్ నిమిత్తం ఇరుక్కున్న కొరపన్ను తీయించుకోవాలనుకున్నారు. వారికి CBCT తీయించుకోవలసిందిగా సలహా ఇవ్వడం జరిగింది.
వారు CBCT తీయించుకోగ ఇరుక్కున్న కొర పన్ను, ఎక్కువ భాగం పెదం వైపు ఉన్నట్టుగా గుర్తించటమైనది.
సాధారణంగా, ఇరుక్కున్న కొర పన్ను అంగటివైపునుండి తీస్తారు. కానీ అలా తీసి వుంటే, చాలా రక్తం మరియు ఎముక పోవటానికి ఆస్కారం ఉండేది.
మెరుగైన నోటి ఆరోగ్యానికి మొదటి అడుగు వేయండి!
నోటి ఆరోగ్యంపై చిట్కాలను పొందండి మరియు మీ దంత ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మార్గాలను కనుగొనండి. ఈరోజే సైన్ అప్ చేయండి
ఇతే 3D CBCT (ఎక్స్-రే) ఉండటం వలన పన్ను ఎటువైపు ఉందో స్పష్టంగా తెలిసింది.
పన్ను పెదం వైపు నుండి తీసి ఎముకను కాపాడటం జరిగింది. దీనివలన ఎక్కువ రక్తం పోకుండా, మరియు ఎక్కువ ఎముక తీయకుండా ఆపరేషన్ చేయటం జరిగింది.
Pingback: సరికొత్త టెక్నాలజీ తో డెంటల్ ఇంప్లాంట్స్ (Dental Implants) ఇప్పుడు మీ కాకినాడ లో - SAI KRISHNA DENTAL CARE AND IMPLANT CENTER