క్లిప్స్ / Braces ట్రీట్మెంట్ అంటే ఏంటి?

మన ముఖంలో అందమైన భాగం మన పళ్ళే! దీనిని ఎవరు కాదనగలరు. అటువంటి పళ్ళని ఇంకా అందంగా చేయగలమా?

Free Consultation for a Perfect Smile

braces

Unlock the perfect smile with a FREE Braces or Orthodontic Consultation Today. Limited spots are available! Don't miss this exclusive opportunity. Reserve your spot now for a confident, radiant smile! 😁✨ #SmileMakeoverDay #TransformYourSmile

  • arrow-right

    Experienced Orthodontist

  • arrow-right

    Personalised Treatment plans

  • arrow-right

    State-of-Art Technology

  • arrow-right

    Flexible payment (EMI) Plans


చేయగలం, అదికూడా పంటికి ఎటువంటి హాని తలపెట్టకుండా! ఇది క్లిప్స్ ట్రీట్మెంట్ తో సాద్యమవుతుంది. ఎత్తు మరియు వంకర పళ్లకు సరైన పరిష్కారం ఈ క్లిప్స్ ట్రీట్మెంట్.

ఈ చికిత్సలో పళ్లకు క్లిప్లు అమర్చి ఒక వరుసలోకి తీసుకువస్తారు. సాధారణంగా ఈ చికిత్సకు 6 నెలల నుండి 1 సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ సమయము పడుతువుడి.

ఎటువంటి వారికి ఈ క్లిప్స్ ట్రీట్మెంట్ అవసరం?

  1. పళ్ళ అమరికలో చాలా లోపాలు ఉండవచ్చు. ఉదాహరణకి
  2. ముందు పళ్ళ మధ్యలో సందులు ఉండటం (Diastema)
  3. ముందు పళ్ళు ఎత్తుగా ఉండటం (Proclined teeth)
  4. పళ్ళు వంకరగా ఉండటం
  5. ముందు పళ్ళు బాగా వెనుకాల ఉండటం/ పళ్ళు నవ్వినప్పుడు కనిపించకపోవడం
  6. నవ్వినప్పుడు చిగురు ఎక్కువగా కనిపించటం (Gummy smile)
  7. పళ్ళు కొరికే విధానం సరిగా లేకపోవటం (Deep bite)

వీటన్నిటికీ ఉత్తమమైన పరిష్కారం క్లిప్స్ ట్రీట్మెంట్ ద్వారా లభిస్తుంది.

ఏ వయసువారు ఈ క్లిప్స్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు?

వయసుతో నిమిత్తం లేకుండా అన్ని వయస్కుల వారు ఈ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఐతే 14 నుండి 18 సంవత్సరములలోపు వారికి ఇది అధిక ఫలితాలను ఇస్తుంది. అవును! నిజమే, ఈ వయసులో పిల్లలలో ఎముక (Bone) చాలా మెత్తగా మరియు పళ్ళ కదలికలను తట్టుకునేలా ఉంటుంది.

మెరుగైన నోటి ఆరోగ్యానికి మొదటి అడుగు వేయండి!

నోటి ఆరోగ్యంపై చిట్కాలను పొందండి మరియు మీ దంత ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మార్గాలను కనుగొనండి. ఈరోజే సైన్ అప్ చేయండి

Subscribe to Blog via Email

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.


14 సంవత్సరాలకన్న చిన్న వయస్కుల వారిలో ఎముక ఇంకా పెరిగే క్రమంలోనే ఉంటుంది కాబట్టి, వారిలో క్లిప్స్ ట్రీట్మెంట్ చేయించకపోవటం మంచిది. ఇది మీ దంత వైద్యుడు ఒక X-ray ద్వారా, ఎముక పెరగడం ఆగిందా, లేదా, అనేది దృవీకరిస్తారు.

ఐతే 18 సంవత్సరాలు పైబడిన వారు కూడా క్లిప్స్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. దీనిని Adult orthodontics అంటారు. కానీ దీనికి ఎక్కువ సమయము పడుతుంది.

ఒక్కోసారి ట్రీట్మెంట్ చేయించుకున్న తెరువాత మరలా పళ్ళు వంకరగా మారవచ్చు. దీనిని Relapse అంటారు. ఇది సాధారణంగా ఎముక బాగా గట్టిపడిన వారిలో రావచ్చు. కానీ అన్నిటికీ పరిష్కారాలు ఉన్నాయి.

క్లిప్స్ ట్రీట్మెంట్ ఎన్ని రకాలు?

కాలానికి అనుగుణంగా క్లిప్స్ ట్రీట్మెంట్ కూడా అభివృద్ధి చెందుతూ వచ్చింది.

  1. Steel క్లిప్స్: ఇవి పేరుకు తగ్గట్టుగా steel తో తయ్యారు చేయబడినవి.
  2. Ceramic క్లిప్స్: ఇవి పింగాణీ తో చేయబడినవి. దూరం నుంచి చూసినప్పుడు ఇవి మాములు పాళ్లలాగే కనిపిస్తాయి.
  3. Lingual క్లిప్స్: ఇవి పంటి వెనుక భాగంలో అమరుస్తారు. బయటికి కనిపించవు.
  4. Invisible క్లిప్స్: ఇవి క్రొత్తగా వాడుకలోకి వచ్చినవి. ఇవి ప్లాస్టిక్ తో తయ్యారు కాబడినవి.

క్లిప్స్ ట్రీట్మెంట్ చేయించుకునే వారు ఇవి తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.

ట్రీట్మెంట్ ను మధ్యలో మానటం మంచి పని కాదు. కావున తప్పనిసరిగా ఏ అపాయింట్మెంట్ను వదులుకోవద్దు. క్రమం తప్పకుండా మీ దంత వైద్యుడిని సంప్రదించండి.

ట్రీట్మెంట్ కు 6 నెలల నుండి సంవత్సరం వ్యవధి తప్పనిసరిగా కావలెను. అందువలన మీరు ఈ సమయము ట్రీట్మెంట్ కి వెచ్చించగలను అనుకుంటేనే చేయించుకోండి.

ట్రీట్మెంట్ సమయములో నోటి శుభ్రత చాలా ముఖ్యము. నోటిని క్రమం తప్పకుండా రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకోండి.

సరైన సమయములో క్లిప్స్ ట్రీట్మెంట్ చేయించుకోవడం వలన మనపళ్ళు ఎంతో అందంగా మరియు మన ముఖం, ఆకర్షనీయంగా కనిపిస్తుంది. మరిన్ని వివరముల కొరకు మీ దంత వైద్యడిని లేదా 8074304048 ను సంప్రదించండి.

Discover more from SAI KRISHNA DENTAL CARE & IMPLANT CENTER | BEST DENTAL CLINIC IN KAKINADA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Scroll to Top