మీ రూట్ కెనాల్ ఐన పన్నుకు తొడుగు లేదా క్యాప్ వేయించుకోవాలని అనుకుంటున్నారా? మీరు ఫిక్సెడ్ పళ్ళు కట్టించుకోవాలని అనుకుంటున్నారా? ఇతే ఈ వ్యాసం మీరు తప్పనిసరిగా చదవాలి.
పంటి క్యాప్ / తొడుగు అంటే ఏంటి?
క్యాప్ లేదా తొడుగు అనేది, మన సహజ దంతాలకు బదులుగా వాడే కృత్రిమ దంతాలు.
సాధారణంగా రూట్ కెనాల్ ఐన పళ్ళ పైన లేదా పళ్ళు లేని చోట్ల ఈ కృతిమ పళ్లను అమరుస్తారు. ఇవి మన పళ్లలానే ఉంటాయి. మరియు అవి తినడానికి కూడా ఉపయోగ పడతాయి.
రూట్ కెనాల్ తెరువాత క్యాప్ ఎందుకు వేయించుకోవాలి?
రూట్ కెనాల్ తెరువాత క్యాప్ లు అవసరం. ఎందుకంటే, రూట్ కెనాల్ తెరువాత పన్ను ఇంతకు ముందు ఉన్నంత బలంగా ఉండదు.
రూట్ కెనాల్ చేసేటప్పుడు పాడైన పన్ను యొక్క నరాలు, రక్త నాణాలను తీసి, అందులో వేరొక పదార్ధముతో నింపుతారు.
మెరుగైన నోటి ఆరోగ్యానికి మొదటి అడుగు వేయండి!
నోటి ఆరోగ్యంపై చిట్కాలను పొందండి మరియు మీ దంత ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మార్గాలను కనుగొనండి. ఈరోజే సైన్ అప్ చేయండి
అటువంటప్పుడు పన్ను యౌక్క సహజమైన బలాన్ని అది కోల్పూతుంది. అటువంటి సమయములో పంటి పైన క్యాప్ మనకు ఎంతో ఉపయోగపడుతుంది.
ముఖ్యంగా మనం గట్టి పదార్ధాలను తినేటప్పుడు, పన్ను విరగకుండా ఈ క్యాప్ కాపాడుతుంది. అందువలన మేము రూట్ కెనాల్ చేయించుకున్న పతీ ఒక్కరికీ తప్పనిసరిగా క్యాప్ వేయించుకొమ్మని చెబుతాము.
క్యాప్ లు ఎన్ని రకాలు?
క్యాప్ లు ముఖ్యంగా నాలుగు రకాలుగా మనకు అందుబాటులో ఉంటాయి.
మెటల్ క్యాప్ లు
మెటల్ క్యాప్ లు అనేవి నిక్కెల్, కోబాల్ట్, మరియు క్రోమ్ లోహంతో తయారవుతాయి. కాన్ని ఇది చాలా పాత పద్ధతి. ఇవి చూడటానికి అంతగా బాగోవు. అంతే కాక, కొన్నాళ్ళకు అక్కడక్కడ తుప్పు పట్టే ఆస్కారం కూడా ఉంది.
ప్రస్తుత సమయం లో వీటి వాడుక చాలా తక్కువగా ఉంది. ఈ క్యాప్ లు అన్నిటికంటే చాలా తక్కువ ధరలో లభిస్తాయి.
ఈ మెటల్ క్యాప్ లు వాడే వారు, కొన్ని రకాలైన x-ray లు తీయించుకోవటాని అర్హులు కారు. ముఖ్యంగా MRI లాంటి ఆధునిక X ray పరికరాలు, ఈ మెటల్ క్యాప్ లు ఉన్న వాళ్ళలో వాడలేము.
అంటే కాదు, CT లాంటి X-ray తీసేటప్పుడు చిత్రాలు సరిగ్గా రావు.
అంటే, మెటల్ క్యాప్ లు ఉన్నవాళ్లలో MRI మరియు CT లంటి ఆధునిక పరికరాలతో X ray లు తీయలేము.
PFM క్యాప్ లు
వీటిని Porcelain fused to metal, అంటే పింగాణి పూత వేయించిన మెటల్ క్యాప్ లు అని అంటారు. అనగా లూహపు క్యాప్ ల పైన పింగాణి పూత పూస్తారు అన్నమాట.
బలంలో ఇవి మెటల్ క్యాప్ లకు సమానంగా ఉంటాయి.
ఇవి చూడటానికి తెల్లగానే ఉంటాయి కానీ, మెటల్ క్యాప్ ల లాగే ఇవి పెట్టుకున్న వారికి, CT మరియు MRI వంటి అధునాతన పరికరాలతో X-ray లు తీయటం సాధ్యపడదు.
అంతేకాక లోపలి భాగంలో మెటల్ ఉండటం వలన, తుప్పు పట్టే ఆస్కారం కూడా ఉంటుంది. దానినే కరోషన్ అని అంటారు.
పింగాణి క్యాప్ లు
మొత్తం పింగాణితో చేసిన క్యాప్ లు చూడటానికి అచ్చు పన్ను లానే ఉంటాయి. ఇవి చాలా అందంగా ఉంటాయి. దూరం నుంచి సహజమైన పన్ను లానే కనిపిస్తుంది.
ఈ రకం క్యాప్ లు మొత్తం పింగాణి తో తయ్యారయ్యి వస్తాయి. కానీ ఇవి మెటల్ క్యాప్ లకు ఉన్నంత బలం ఉండక పోవచ్చు. అందువలన విరిగి పోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.
జిర్కోనియా క్యాప్ లు
జిర్కోనియా క్యాప్ లు చూడటానికి తెల్లగా అచ్చు సహజమైన పళ్లలానే అనిపిస్తాయి.
ఈ రకం క్యాప్ లు చూడటానికి సహజంగా పింగాణి పళ్లను పోలి ఉంటాయి, అంతే కాదు, బలం లో మెటల్ క్యాప్ లకు సమానంగా ఉంటాయి.
అందువలన ఇవి చూడటానికి సహజంగాను మన్నికలో మెటల్ క్యాప్ లతో సమానంగా ఉంటాయి.
అంటే, అన్నీ విధాలా జిర్కోనియా క్యాప్ లు మన పళ్లను కాపాడి, దీర్ఘ కాలం మన్నుతాయి.
అంతే కాదు, జిర్కోనియా క్యాప్ లు పింగాణి పల్లకన్నా చాలా సన్నగా ఉంటాయి. ఇవి ఎక్కువగా స్మైల్ డిజైనింగ్ చేయించుకున్న ముందు పళ్ళకు వాడతారు.
ఈ వ్యాసం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు షేర్ చేయండి. మరిన్ని వివరాల కొరకు మమ్మల్ని WhatsApp ద్వారా కాలవ వచ్చు.