ఒకరోజు ఒక పేషెంట్ నోటి మంటతో నాదెగ్గరకు వచ్చారు. ఆవిడ గత 3ఏళ్లుగా నోటి మంటతో బాధపడుతున్నారు. ఇన్నాళ్లు ఇంటి చిట్కాలతోనే ఆవిడ తన వైద్యం తాను చేసుకునేవారట.
ఐతే ఈసారి మంట తగ్గకపోవటం వల్ల నా దెగ్గరకు వచ్చానని చెప్పారు.
నాకు తెలిసి, మన దేశంలో చాలామంది ఈ పద్దతిని పాటిస్తున్నారు. కాని తెలియని విషయం ఏమిటంటే నోటిపూత చాలా కారణాలవల్ల వస్తుంది.
నోటిపూతకి నూటొక్క కారణాలు! అవును ఈ నానుడి నిజమే. నోటిలో మంట చాలా కారణాలవల్ల రావచ్చు. మన భారత దేశంలో నోటిపూతతో ఎక్కువగా బాధపడేవారు విటమిన్ల లోపము వలనే.
మన దేశంలో ఎక్కువ మంది ఆడవారు anemia (రక్త హీనత ) వల్ల బాధపడుతున్నారు. వీరిలో ఎక్కువగా నోటిపూత వస్తూ ఉంటుంది.
అసలు దేనిని నోటిపూత అంటారు?
నోటిపూత వచిన్నవారు వీటితో బాధపడతారు:· నోరు బాగా మండడం· కారం తినలేక పోవటం· నోరు చేదుగా ఉండడం· పొడిగా ఉన్న పదార్ధం తినలేక పోవడం·
మెరుగైన నోటి ఆరోగ్యానికి మొదటి అడుగు వేయండి!
నోటి ఆరోగ్యంపై చిట్కాలను పొందండి మరియు మీ దంత ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మార్గాలను కనుగొనండి. ఈరోజే సైన్ అప్ చేయండి
నోటిలో మార్పులు రావడం: అనగా నోటి చర్మంపై ulcer లేదా చర్మంపై మార్పులు గమనించడం
నోటిపూత దీనివల్ల వస్తుంది:
- రక్తం తక్కువగా ఉన్నప్పుడు
- విటమిన్ల లోపం వలన
- నోటిలో ulcers వచ్చినప్పుడు
- లాలాజలం తక్కువగా ఉన్నప్పుడు
- కొన్ని మందులు పడకపోయినప్పుడు
ఐతే ఇవన్నీ సాధారణ కారణాలు. వీటన్నిటిని మించి ఈ మధ్య ఎక్కువగా చూస్తున్న మార్పు ఒకటుంది. దానినే lichen planus (లైకెన్ ప్లానస్) అంటారు. అవును ఈ మధ్యకాలంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
లైకెన్ ప్లానస్ లక్షణాలు
ఇది ఎక్కువగా ఆడవారిలో వస్తుంది. నోటిలో వచ్చినప్పుడు దీని లక్షణాలు ఇలా ఉంటాయి
- నోరు మంట రావడం
- కారం తినలేకపోవటం
- నోరు పరిశీలించినప్పుడు నోటిలో ఎరుపు మరియు తెలుపుతో కలిసినటువంటి మార్పులు కనిపించడం
- నోటిపూత లాంటి లక్షణాలు కనిపించటం· బుగ్గ, నాలుక మరియు చిగురు ముండడం
లైకెన్ ప్లానస్ చర్మం మీదకూడా వస్తుంది !
చర్మం మరియు నోటిలో వచ్చే ఈ జబ్బు వేరువేరు లక్షణాలతో ఉంటుంది. చర్మం మీద మొదట వేళ్ళ గోళ్లలో మొదలవుతుంది. తెరువత చర్మం మీద నల్లటి మచ్చలు మొదలవుతాయి. ఇవి ఎక్కువగా మోకాలు క్రింద భాగంలో ఎక్కువగా వస్తాయి.
పరిష్కారం:
మీ దెగ్గరలో ఉన్న దంత వైద్యుడ్ని సంప్రదించండి. లేదా దంత వైద్య విభాగంలో ఓరల్ మెడిసిన్ (ORAL MEDICINE) నిపునుడిని సంప్రదించండి. మందులు ఆడటం వలన ఈ రోగాన్ని కొంతవరకు అణచివేయవచ్చు.