అసలు క్లిప్స్ ట్రీట్మెంట్ ఎన్ని రకాలు? ఎవరికి క్లిప్స్ ట్రీట్మెంట్ ఉపయోగకరం? ఖర్చు ఎంత అవుతుంది? ఎంత సమయం పడుతుంది?
ఇటువంటి మరెన్నో ప్రశ్నలకు ఈ చిన్న వ్యాసంలో సమాధానం దొరుకుతుంది.
క్లిప్స్ / బ్రేసెస్ (Clips / Braces) అంటే ఏంటి?
పెరిగే పిల్లల్లో మరియు పెద్దవారిలో పళ్ళు వంకరగా ఉండటం మనం తరచూ చూస్తుంటాం. ఈటె, ఇటువంటి వంకర, మరియు ఎత్తు పల్లను సరిచేయు పద్ధతినే క్లిప్స్ ట్రీట్మెంట్ అంటారు.
ఈ చికిత్సలో, పళ్లమీద క్లిప్స్ ను అమర్చి ఒక తీగ ద్వారా వంకర మరియు ఎత్తు పల్లను సరిచేస్తారు.
For more information on braces do read this article
మెరుగైన నోటి ఆరోగ్యానికి మొదటి అడుగు వేయండి!
నోటి ఆరోగ్యంపై చిట్కాలను పొందండి మరియు మీ దంత ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మార్గాలను కనుగొనండి. ఈరోజే సైన్ అప్ చేయండి
ఎవరికి క్లిప్స్ ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది?
ఎత్తు మరియు వంకర పళ్ళు ఉన్న ఎవరైనా క్లిప్స్ ట్రీట్మెంట్ కి అర్హులు. ఐతే! వయసును బట్టి ఈ ట్రీట్మెంట్ లో చిన్న చిన్న మార్పులు ఉంటాయి.
క్లిప్స్ ట్రీట్మెంట్ ఎన్ని రకాలు? | Types of dental braces
ఇది సరైన ప్రశ్న. టెక్నాలజి పెరిగే కొద్ది క్లిప్స్ ట్రీట్మెంట్ లో కూడా చాలా మార్పులు వచ్చాయి. వీటిని ఒక్కొకోటిగా పరిశీలిద్దాం.
మెటల్ బ్రేశెస్ (Metal clips / Braces )
ఎక్కువమంది వాడే ట్రీట్మెంట్ ఇది. మెటల్ క్లిప్ లు అనగా, మన పళ్ల మీద ఒక లోహం తో చేసిన క్లిప్ లను అమరుస్తారు. ఒక సన్నటి తీగను ఈ క్లిప్ ల ద్వారా పళ్ళకు కడతారు.
ఈ తీగ ద్వారా మన పళ్లమీద చిన్నపాటి ఒత్తిడి తీసుకువచ్చి, మనకు నచ్చినట్లు పళ్లను ఒక క్రమంలో అమరుస్తుంది.
మెటల్ క్లిప్ ల వల్ల లాభాలు
- మెటల్ క్లిప్ లు అనేవి ఎప్పటినుంచో వాడుతున్న పద్ధతి. ఇది ఎంతో మంది దంత వైద్యుల ద్వారా దృవీకరించబడినది.
- ధర తక్కువ
- మిగిలిన క్లిప్ ట్రీట్మెంట్లకన్నా త్వరగా మార్పులు చూడవచ్చు.
- అన్ని రకాల పంటి వంకరాలను ఈ పద్ధతి ద్వారా సరిచేయవచ్చు.
మెటల్ క్లిప్ ల వల్ల నష్టాలు.
- మెటల్ క్లిప్ లు చూడటానికి బాగోవు.
- మెటల్ క్లిప్ లు ధరించిన వారికి, బుగ్గలో గుచ్చుకోవటం, పేదల పైన ఒత్తిడి ఉండటం జరుగుతుంది.
- పళ్ళు క్లీనింగ్ సరిగ్గా చేసుకోకపోతే, ఎక్కువ శాతం తినే పదార్ధాలు, ఇరుక్కుపోయే ఆస్కారం ఉంటుంది.
సెల్ఫ్ లైగేటింగ్ క్లిప్ లు (Self-ligating braces / Clips)
సెల్ఫ్ లైగేటింగ్ క్లిప్ లు మెటల్ క్లిప్ ల మాదిరిగానే, ఉంటాయి, ఈటె, వీటికి, మెటల్ వీరే ను పట్టుకోవటానికి, ఒక చిన్న, తలుపు ఉంటుంది.
అనగా, తీగ క్లిప్ ల మీద పెట్టగానే, ఈ తలుపు మూసుకొని, తీగను గట్టిగా పట్టుకుంటుంది. అనగా మెటల్ క్లిప్ ల మాదిరిగా, వేరొక పరికరం తో తీగను క్లిప్ లకు కట్టవలసిన అవసరం ఉండదు.
కానీ, సెల్ఫ్ లైగేటింగ్ క్లిప్ లు చిన్న చిన్న పళ్ల సందులు, మరియు వంకరాలను సరిచేయటానికే, ఉపయోగపడతాయి. పెద్ద పెద్ద పళ్ల వంకరాలను, సరిచేయటానికి ఇవి ఉపయోగపడవు.
సెల్ఫ్ లైగేటింగ్ క్లిప్ ల వల్ల లాభాలు
- మనం తిన్న పదార్ధాలు, వీటిల్లో తక్కువ ఇరుక్కుంతాయి. కావున, మెటల్ క్లిప్ ల కన్నా వీటిని శుభ్రం చేసుకోవటం, ఎంతో సులభం.
- మీరు దంతా వైద్యుని దగ్గర గడిపే సమయం తగ్గుతుంది.
సెల్ఫ్ లైగేటింగ్ క్లిప్ ల వల్ల నష్టాలు.
- అన్నీ రకాల పంటి వంకరలకు, ఈ క్లిప్ లు సరిపడవు. పెద్ద పెద్ద, పంటి కదలికలు, ఈ రకం క్లిప్ ల ద్వారా జరగవు. అందువలన, సెల్ఫ్ లైగేటింగ్ క్లిప్ లు అందరికీ సరిపడవు.
- ఈ క్లిప్ లు, మెటల్ క్లిప్ ల కన్నా ధర ఎక్కువ.
సిరామిక్ క్లిప్ లు (Ceramic Clips / Braces)
సిరామిక్ క్లిప్ లు చూడటానికి తెల్లగా ఉంటాయి, మరియు పళ్లలో కలిసిపోతాయి. దూరం నుంచి చూసినవారికి, క్లిప్ లు పెట్టిచ్చుకున్నట్టు, కనిపించవు.
ఈ క్లిప్ లు పింగాణి తో చేయబడతాయి. ఇవి కూడా, మెటల్ క్లిప్ లు లాగే పనిచేస్తాయి. కాకపోతే, ఈ క్లిప్ లు ఎక్కువకాలం ధరించవలసి వస్తుంది.
సిరామిక్ క్లిప్ లు పళ్ల మీద, తక్కువ ఒత్తిడిని కలిగిస్తాయి. అందువలన ట్రీట్మెంట్ సమయం, మెటల్ క్లిప్ ల కన్నా కొద్దిగా ఎక్కువ సమయం ఉంచవలసి వస్తుంది.
సిరామిక్ క్లిప్ ల వల్ల లాభాలు.
- క్లిప్ లు దూరం నుంచి చూస్తే కనిపించవు
- తెల్లగా ఉండటం వలన పళ్ల లో కలిసిపోతాయి.
- పేదల పైన మరియు చుగుల్లా పైన తక్కువ ఒత్తిడి కలిగిస్తాయి.
సిరామిక్ క్లిప్ ల వల్ల నస్తాలు
- ట్రీట్మెంట్ పూర్తవటానికి ఎక్కువ సమయం పడుతుంది.
- సిరామిక్ క్లిప్ ల బలం, మెటల్ క్లిప్ ల కంటే తక్కువ. అందువలన, అవి విరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందువలన, విరిగినప్పుడల్లా, ఈ క్లిప్ లను మార్చుకోవలసి వస్తుంది. లేదా, వీటిని, జాగ్రత్తగా ఉండ్చుకోవాలి.
- సిరామిక్ క్లిప్ లకు జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి.
- మెటల్ క్లిప్ ల కన్నా ఏవి ధర ఎక్కువ.
అలైనెర్లు (Aligners)
అలైనెర్లు అనేవి, క్లిప్ ల లాంటివి కాదు. ఇవి ఒక ప్లాటిక్ తొడుగు లాగా ఉంటాయి. ఈ తొడుగు, మీ పైన మరియు క్రింద పళ్ల మీద వస్తుంది. ఇవి దూరం నుంచి అస్సలు కనిపించవు.
అలైనెర్లు ఎక్కువగా, ప్రజలతో తెరిగే వాళ్ళు, మరియు ప్రజలతో ఉండే వాళ్ళకు ఎక్కువ ఉపయోగ పడుతాయి. ఎందుకంటే, వీలు, మెటల్ క్లిప్ లు ఎక్కువగా ఇస్తాపడరు. దానికి కారణం, వారు మాటడినప్పుడు, మెటల్ క్లిప్ లు బయటకు, అందంగా కనిపించవు. ఇటువంటి వారికి, అలైనెర్లు, బాగా ఉపయోగ పడుతాయి.
అలైనెర్ల చికిత్స, మెటల్ క్లిప్ ల చికిత్స కంటే భిన్నంగా ఉంటుంది. ఇందులో, మీకు, ఒకేసారి, ఒక 5 నుండి, 10 ప్లాస్టిక్ తొడుగులను ఇస్తారు.ఒక్కో తొడుగు, ఒక్కో సమయం లో పెట్టుకోవాలి. ఎప్పుడు పెట్టుకోవలో, కూడా ముందే చెబుతారు.
ఉదాహరణకు, మే దంత వైద్య్దు, 10 ప్లాస్టిక్ తొడుగులను ఇచ్చి, వాటిని, ప్రతి 15 రోజులకు మార్చమని, చెబితే, దాని అర్ధం, ఒక్కో తొడుగు లేదా అలైనర్, 15 రోజులు వాడాలి అన్నమాట.
అలైనర్ ల వల్ల లాభాలు
- చూతటానికి ఇవి దూరం నుంచి అస్సలు కనిపించవు.
- ఇవ్వి ఎప్పుడు కావాలంటే, అప్పుడు తీసివేయచూ.
- తినే పదార్ధాలు ఎక్కువగా ఇరుక్కొవు.
- అలైనర్ లు శుభ్రం చేసుకోవటం చాలా సులభం.
అలైనర్ ల వల్ల నష్టాలూ
- ఇవి, మెటల్ క్లిప్ ల కన్నా చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవి.
- అన్నీ రకాల పంటి వంకరలకు ఇవి సరిపడవు. అనగా అలైనర్ ల పని తీరు, మెటల్ క్లిప్ ల అంతా సమర్ధంగా ఉండవు.
- చిన్న చిన్న వంకరాలు, మరియు పళ్ల మధ్య ఖాళీలు ఈ అలైనర్ ల ద్వారా సరిచేయవచ్చు.
మీకు మరిన్ని వివరాలకు, మమ్మల్ని సంప్రదించటం మర్చిపోవద్దు. మీకు ఈ వ్యాసం కనక నచ్చినట్లయితే, తప్పకుండ మీ బంధువుయకు షేర్ చేయండి.
ట్రీట్మెంట్ చేసేటప్పుడు నెప్పి వస్తుందా
కొంతమందికి, మొదట్లో, పళ్ళు జువ్వు మని లాగటం తెలుస్తుంది. కానీ. ఇది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. తరువాత తగ్గిపోతుంది.
పెద్ద వాళ్ళు కూడా క్లిప్స్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చా?
చేయించుకోవచ్చు. ఐతే, మనిషి వయసు మరియు పళ్ళ వరుస బట్టి ఈ ట్రీట్మెంట్ మారుతుంటుంది. పెద్ద వాళ్లకు చిన్న వాళ్ళతో పోలిస్తే కొద్దిగా ఎక్కువ సమయం పడుతుంది.
ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి?
ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు, అప్పాయింట్మెంట్లు మిస్ చేయకూడదు. ప్రతి నెల తప్పనిసరిగా దంత వైద్యుడ్ని సంప్రదించాలి.
పళ్ళు శుభ్రంగా ఉంచుకోవాలి. దాని కోసం ప్రత్యేకంగా ఆర్తో బ్రష్లు ఉన్నాయి. వాటిని వాటాల.
క్రమం తప్పకుండా రోజుకి రెండు సార్లు బ్రష్ చేయాలి
ఒకవేళ ట్రీట్మెంట్ మధ్యలో క్లిప్ లు ఊడిపోతే వెంటనే మీ దంత వైద్యుని ద్వారా సరిచేయించుకోవాలి.
క్లిప్ ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే తప్పనిసరిగా పళ్ళు తీయించుకోవాలా?
అవసరం లేదు. ఒకవేళ మీ పళ్ళ మధ్యలో సరిపడినంత ఖాలి ఉంటే, పళ్ళు తీయవలసిన అవసరం లేదు.
పన్ను తీయలో లేదో మీ డాక్టరు ముందే చెబుతారు.
క్లిప్స్ ట్రీట్మెంట్ తరువాత పళ్ళు మళ్ళీ మొదటికి వచ్చే అవకాశం వుంటాదా?
ఇది అందరిలో జరగదు. ముఖ్యంగా చిన్న పిల్లలలో అస్సలు జరుగదు. దీనిని RELAPSE (రెలాప్సే) అని అంటారు.
కానీ ఇటువంటి ఇబ్బందులు చాలా అరుదు. ఒకవేళ జరిగినా, పెద్ద వాళ్లలో జరుగటానికి ఆస్కారం. ఎక్కువ
సాయి కృష్ణ డెంటల్ కేర్ మరియు ఇంప్లాంట్ సెంటర్ నందు వంకర పల్లకు సంభందించి మేము అందించు సదుపాయాలు క్రింద తెలుపబడినవి.
మా ప్రత్యేకతలు
Treatment options
- తక్కువ ఖర్చుతో క్లిప్స్ లేదా braces చికిత్స
- అత్యాధునిక 3D ప్రింటింగ్ పరికరాలతో చికిత్స
- అన్ని రకాల క్లిప్స్ చికిత్స లభిస్తుంది
- సులభ వాయిదాలలో చేకిత్స చేయించుకొనే సౌలభ్యం (EMI)
- Metal braces
- Self- ligating braces
- Ceramic braces
- Lingual braces
- Metal free Aligners