డెంటల్ ఇంప్లాంట్స్ అంటే ఏంటి?
డెంటల్ ఇంప్లాంట్స్ (Dental implants) కృత్రిమ పళ్ళలో ఒక రకముగా చెప్పవచ్చు. ఐతే! ఇవి రెండు భాగాలుగా వస్తాయి. వేరు భాగం ఒక చిన్న screw లాగా ఉంటుంది. అనగా ఇది బోణికేలో అమర్చబడి ఉంటుంది. పైన భాగాన్ని, crown అని అంటారు. ఇది మనకు కనిపించే పన్ను లాగా ఉంటుంది.
ఈ పన్ను భాగం మన బోణికేలో వేసిన screw కి, abutment (అబూట్మెంట్) అనే పరికరం ద్వారా అమర్చబడి ఉంటుంది. ఇంప్లాంట్లు అనేవి మన దంతాలతో సమానముగా బలం కలిగి ఉంటాయి.
అవి ఎన్ని రకాలు?
మనకు మార్కెట్ లో పలు రకాల ఇంప్లాంట్లు లభ్యమవుతాయి. ఐతే ఒక్కో రకం ఇంప్లాంట్లు ఒక్కో మనిషికి ఉపయోగ పడతాయి. మనం ఎక్కువగా వాడే ఇంప్లాంట్ రకాలను ఇప్పుడు గమనిద్దాం.
- Endosteal ఇంప్లాంట్స్: ఇవి బాగా ఎక్కువగా వాడుకలో ఉన్న ఇంప్లాంట్లు. ఇవి, పంటి వేరు మాదిరి, క్రింద భాగం సన్నగా ఉంటాయి. వీటిని, మన బోణికేలో screw లాగా అమరుస్తారు. ఇవి మూడు నెలల వ్యవధిలో మన ఎముక తో కలిసి పోయి మంచి ధృఢంగా నిలుస్తాయి.
- సబ్ periosteal ఇంప్లాంట్స్: ఇవి ఎముక పైన screw ల సహాయం తో అమర్చబడతాయి. ఐతే ఇవి ఇప్పుడు ఎక్కువగా వాడటం లేదు.
- Basal / Bicortical ఇంప్లాంట్స్: ఈ ఇంప్లాంట్లు ఎముక బాగా తక్కువ ఉన్న వారిలో వేస్తారు. ఇవి endosteal ఇంప్లాంట్లు కన్నా సన్నగా ఉంటాయి.
- Zygomatic ఇంప్లాంట్స్: ఈ ఇంప్లాంట్లు mana మొహం లోని zygoma అనే ఎముక యొక్క సహాయం తో నిలబడతాయి. అంటే మన దంత ఎముక తో పాటు, zygoma ఎముక సహాయం తీసుకుంటారు. Zygoma ఇంప్లాంట్లు చాలా పొడవుగా ఉంటాయి. ఈ ఇంప్లాంట్లు కూడా ఎముక బాగా తక్కువ ఉన్నవారిలో ఉపయోగిస్తారు.
- Pterygoid ఇంప్లాంట్స్: Pterygoid ఇంప్లాంట్స్ అనేవి, మన పై దవడ వెనుక భాగంలో కృత్రిమ పళ్ళు అమర్చడం కొరకు ఉపయోగిస్తారు. ఇవి కూడా బోణికే ఎక్కువ లేని వారిలో ఉపయోగిస్తారు.
ఎటువంటి ఇంప్లాంట్లు నాకు సరిపోతాయి?
ఈ ప్రశ్నకు సరైన సమాధానం మీ దంత వైద్యుడు మాత్రమే చెప్పగలరు. వారు, మీ పళ్ళను పరీక్షించిన పిమ్మట, ఎముక లభ్యత బట్టి, ఏ ఇంప్లాంట్లు వేయించుకుంటే సరిపోతుందో ఇట్టే చెప్పగలరు.
డెంటల్ ఇంప్లాంట్స్ ఎలా వేస్తారు?
డెంటల్ ఇంప్లాంట్స్ వేసే విధానము.
మెరుగైన నోటి ఆరోగ్యానికి మొదటి అడుగు వేయండి!
నోటి ఆరోగ్యంపై చిట్కాలను పొందండి మరియు మీ దంత ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మార్గాలను కనుగొనండి. ఈరోజే సైన్ అప్ చేయండి
- మొదటగా మీ దంత వైద్యుడు, మీ నోటిలోని ఎముకను పరిశీలిస్తారు. అది ఇంప్లాంట్లు వేయటానికి అణకువగా ఉంటే, ఒక 3d x-ray తీయిస్తారు.
- ఆ x-Ray లో ఎముక యొక్క పొడవు మరియు అడ్డం బాగా ఉంటే, అపుడే ఇంప్లాంట్ ల గురించి ఆలోచిస్తారు. ఒకవేళ బోణీక బాగా ఉంటే, ఇంప్లాంట్లు వేయించుకోమని సలహా ఇస్తారు.
- 3 d x -Ray ద్వారా ఇంప్లాంట్లు, ఒక software ఉపయోగించి మన ఎముక పైన ఎక్కడ వేయాలో ప్లాన్ చేస్తారు.
- ఆ ప్లాన్ కి అనుగుణంగా 3 d ప్రింటర్ ద్వారా, ఒక surgical గైడ్ ను తయ్యారు చేస్తారు. గైడ్, ద్వారా మన నోటిలో ఇంప్లాంట్లు వేస్తారు.
- ఇంప్లాంట్లు వేసిన తరువాత ఒక 3 నెలలు, వాటిని ఎముకలోనే వదిలేస్తారు. మూడు నెలలలో ఈ ఇంప్లాంట్, చుట్టూ ఉన్న ఎముక తో కలిసిపోతుంది.
- 3 నెలల తరువాత ఇంప్లాంట్ పైన ఒక పన్ను ఫిక్స్ చేస్తారు.
ఎంత సమయం పడుతుంది?
ఇంతకు ముందు ఇంప్లాంట్లు వేయటానికి సుమారు, 20 నుంచి 30 నిముషాల సమయం పట్టేది. కానీ ఇప్పుడు, గైడ్ ఉపయోగించి వేస్తే 10 నుండి 15 నిముషాలలో పూర్తవుతుంది. మరియు తక్కువ శ్రమతో తక్కువ ఇబ్బంది తో మీరు ఇంప్లాంట్లు వేయించుకోవచ్చు.
Also read: 3D డెంటల్ స్కాన్ ద్వారా బోణికెలో ఇరుక్కున్న పన్ను ఎలా గుర్తించవచ్చు?
నేను డెంటల్ ఇంప్లాంట్స్ వేయించుకోవచ్చా?
డెంటల్ ఇంప్లాంట్స్ ఏ వయసు వారైనా వేయించుకోవచ్చు. ఐతే వీటికి కొన్ని షరతులు కూడా ఉన్నాయి.
- షుగర్ మరియు బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ లో ఉండాలి.
- సరిపడిన ఎముక ఉండాలి
- ఎటువంటి ఎముకకి సంబంధించి కానీ శరీరానికి సంబంధించి కానీ రుగ్మతలు ఉండరాదు.
- గుండెకు సంబంధించిన జబ్బు ఉండరాదు.
- రక్తం సకాలంలో గడ్డ కట్టాలి. ఎటువంటి రక్తానికి సంబంధించిన రుగ్మతలు ఉండకూడదు.
- D విటమిన్ లోపం ఉండకూడదు.
పైన చెప్పిన ఎటువంటి రుగ్మతలు లేని యెడల, మీరు సంతోషంగా ఇంప్లాంట్లు వేయించుకొన వచ్చు.
ఇంప్లాంట్లు ఎంత ఖర్చు అవుతుంది?
సాధారణంగా ఇంప్లాంట్లలో రకాలు ఉంటాయి. రకాన్ని బట్టి, మరియు క్వాలిటీ బట్టి ఒక్కో ఇంప్లాంట్ Rs 15000 నుండి, Rs 25000 దాకా ఖర్చవుతుంది.
పైన చెప్పిన ఖర్చు సాధారణ ఇంప్లాంట్లకు మాత్రమే. ఒకవేళ, కొన్ని అసాధారణ పరిస్థితులలో, ఇంప్లాంట్లు, వేయవలసి వచ్చినప్పుడు, ఖర్చు మారవచ్చు. ఉదాహరణకి, ఇంప్లాంట్ వేసేటప్పుడు, ఉన్న ఎముక సరిపోదన్నప్పుడు, అక్కడ కృత్రిమ ఎముక (bone powder) ఉపయోగిస్తే ఖర్చు వేరేలా ఉంటుంది.
అంతే కాదు, ఒక్కో సారి, ఇంప్లాంట్లు వేయటానికి, కొన్ని సర్జికల్ విధానాలు ఉపయోగించవలసి వస్తుంది. అటువంటప్పుడు మీ దంత వైద్యుడు, మీ దగ్గర ఎక్కువ ఛార్జి చేయవచ్చు.
ఐతే ఈ ఖర్చు మీ దంత వైద్యుని బట్టి మరవచ్చు. వారి, experience మరియు, వారు వాడే పరికరాల బట్టి, ఈ ఖర్చు మారుతూ ఉంటుంది. అంతే కాదు, మీరు ఉన్న ఊరును బట్టి మరవచ్చు కూడా.
డెంటల్ ఇంప్లాంట్స్ లో కొత్త టెక్నాలజీ ఏంటి?
3d ప్రింటర్ ఉపయోగించి ఇంప్లాంట్లు వేయడం అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిన విధానము.
ముందుగా, మీకు ఒక 3 d స్కాన్ తీయడం జరుగుతుంది. ఆ స్కాన్ ఉపయోగించి, మీ దంత వైద్యుడు ఎక్కడ, ఎన్ని ఇంప్లాంట్లు వేయాలో ముందుగా ప్లాన్ చేసుకుంటారు.
ప్లాన్ ప్రకారం, అదే software ఉపయోగించి. ఒక surgical guide తయ్యారు చేస్తారు. ఈ surgical guide, ఎన్ని ఇంప్లాంట్లు ఎక్కడ మరియు ఎలా వేయాలో నిర్ణయిస్తుంది.
Surgical guide ను 3d ప్రింట్ చేస్తారు. 3d ప్రింట్ చేసిన surgical guide ను పేషెంట్ నోటిలో అమరుస్తారు. దాని సహాయం తో మీ ఎముకలోకి డ్రిల్ చేసి, ఇంప్లాంట్ అమరుస్తారు.
ఈ విధంగా ఇంప్లాంట్ వేయటం వలన చాలా లాభాలు ఉన్నాయి.
- రక్తం తక్కువగా పోతుంది.
- ఎక్కువ చిగురు తీయవలసిన అవసరం లేదు.
- చిగురు మరియు ఎముక త్వరగా ఆరుతుంది.
- ఇంప్లాంట్ చేయించుకున్న వారికి తక్కువ ఇబ్బంది ఉంటుంది.
- మనం ముందుగా అనుకున్న స్థానంలో అనుకున్నట్టు ఇంప్లాంట్ వేయగలం.
మీ కోసం ప్రత్యేకం | Special offer (Limited time)
ఇప్పుడు మీ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ కొరకు 25% instant డిస్కౌంట్ పొందగలరు. Get 25% off on all implant procedures (Limited time offer!). Do not miss the change. Call us today!
ఇంప్లాంట్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవటానికి సంప్రదించండి.
Military road | Bhanugudi Jn | Kakinada