డెంటల్ ఇంప్లాంట్

డెంటల్ ఇంప్లాంట్ అనేది (titanium) టైటానియం అనే లోహంతో చేయబడి, మన దవడ ఎముకలో ఇమిడిపోయే ఒక పరికరం. అది మన దంతాలకు ఉండే వేరులు లాగా, ఎముకను గట్టిగా పట్టుకుంటుంది.

Free Consultation for a Perfect Smile

braces

Unlock the perfect smile with a FREE Braces or Orthodontic Consultation Today. Limited spots are available! Don't miss this exclusive opportunity. Reserve your spot now for a confident, radiant smile! 😁✨ #SmileMakeoverDay #TransformYourSmile

  • arrow-right

    Experienced Orthodontist

  • arrow-right

    Personalised Treatment plans

  • arrow-right

    State-of-Art Technology

  • arrow-right

    Flexible payment (EMI) Plans


ఈ ఇంప్లాంట్ పైన మనము కృత్రిమ పళ్ళను కట్టవచ్చు. అనగా ఒక పన్ను నుండి, ఎన్ని పళ్లయినా కట్టవచ్చు.

ఇంప్లాంట్ గురించి మరింత తెలుసుకోవటానికి మమ్ములను సంప్రదించగలరు. 

డెంటల్ ఇంప్లాంట్స్ యొక్క ప్రయోజనాలు

  1. చూడడానికి సాధారణ పళ్ళలాగా కనిపిస్తాయి.
  2. మీ చిరునవ్వు యొక్క సహజ సౌందర్యాన్ని తిరిగి పొందగలరు.
  3. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి మెరుగైన జీవనశైలి పొందడానికి దోహద పడుతుంది.
  4. దంతం పోయిన తరువాత, ఎముక బలాన్ని కోల్పోతుంది. ఐతే ఇంప్లాంట్ ఈ ఎముక ఎక్కువకాలం బలంగా ఉండే లాగా చేస్తుంది. అంతేకాక చిగుళ్ల మాంద్యాలని తగ్గిస్తుంది.
  5. సరిగ్గా నమలడంలో సహాయపడుతుంది, అంతేకాదు, ఆరోగ్యకరమైన మరియు మెరుగైన ఆహారం తినడంలో సహాయ పడుతుంది.
  6. ఇంప్లాంట్ పళ్ళ మాదిరిగా ప్రసంగాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాదు, సహజ ముఖ ఆకృతిని ప్రసాదిస్తుంది. మీ ముఖ్యం యవ్వనంగా కనిపించటంలో సహాయ పడుతుంది.
  7. సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన కట్టుడు పళ్ళు కట్టడంలో సహాయపడుతుంది.

ఇంప్లాంట్ చికిత్స విధానం

మొదటి దశ శాస్త్ర చికిత్సలో ఇంప్లాంట్ ను ఎముకలో అమరుస్తారు. ఐతే దీనికి ముందు, ఒక 3d  x-ray తీస్తారు.

ఈ ఎక్స్-రే లో ఎంత ఎముక ఉంది. ఎలాంటి ఇంప్లాంట్, ఏ సైజూ ఇంప్లాంట్ వేయాలో నిర్ధారిస్తారు.

మెరుగైన నోటి ఆరోగ్యానికి మొదటి అడుగు వేయండి!

నోటి ఆరోగ్యంపై చిట్కాలను పొందండి మరియు మీ దంత ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మార్గాలను కనుగొనండి. ఈరోజే సైన్ అప్ చేయండి

Subscribe to Blog via Email

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.


నిర్ధారించిన దాని ప్రకారం, ఇంప్లాంట్ ను ఎముకలో అమరుస్తారు. ఒకసారి ఎముకలో ఇంప్లాంట్ వేసిన తరువాత 3 నెలల వరకు ఆగుతారు.

ఈ మూడు నెలలలో ఇంప్లాంట్ ఎముకలో కలిసిపోతుంది. అనగా ఎముకతో అతుక్కుపోయి గట్టిగా బిగుసుకుపోతుంది.

మూడు నెలల తరువాత, ఇంప్లాంట్ పైన healing cap అనే స్క్రూ ను అమరుస్తారు. ఇది చిగురును పన్ను పెట్టడానికి తయ్యారు చేస్తారు. దీని వలన చిగురు చక్కగా అర్ధచంద్రాకారంలో తయ్యారు అయ్యి, పన్ను పెట్టడానికి వీలుగా ఉంటుంది.  

ఒక వారం రోజుల తరువాత, పన్ను కట్టడం జరుగుతుంది. కట్టిన పళ్ళు గట్టిగా, మరియు తీయవలసిన అవసరం లేకుండా ఉంటాయి. అంటే ఫిక్సడ్ పళ్ళ లాగా అన్నమాట.

ఇంప్లాంట్ చికిత్స ఎప్పుడు ఎంపిక చేసుకోవచ్చు?

పక్క పళ్ళకు హాని తలపెట్టకుండా పళ్ళు కట్టించుకోవాలని అనుకున్నప్పుడు ఇంప్లాంట్ చికిత్స గురించి ఆలోచించవచ్చు.

ఒక పన్ను కట్టవలసి వచ్చినప్పుడు ఇంప్లాంట్ చికిత్స చేయించుకోవచ్చు.

అనేక పళ్ళు తప్పిపోయినప్పుడు, ఫిక్సడ్ పళ్ళు కట్టడం అసాధ్యం. అటువంటి సమయంలో ఇంప్లాంట్ చికిత్స సరైన ఎంపిక.

తీసి పెట్టుకునే పళ్ళ సెట్టుల వాడేవారు, ఫిక్సడ్ పళ్ళ సెట్టుల చేయించుకోవాలంటే, ఇంప్లాంట్ చికిత్స ఉత్తమం.

ఇంప్లాంట్ అమర్చిన తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు?

నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

చిగురు వాపులు రానివ్వకుండా చూసుకోవాలి.

షుగర్, bp ఉన్నట్లయితే, అవి ఎక్కువ కాకుండా చూసుకోవాలి.

ఆరు నెలలకి ఒక్కసారి మీ దంత వైద్యుడిని సంప్రదించాలి.

ఇంప్లాంట్ వేసిన మొదటి మూడు నెలలు, జిగటగా మరియు గట్టిగా ఉండే పదార్ధాలు అటు వైపు నవలకుండా చూసుకోవాలి.

Never before Offer! Exclusively for you.

మీ కాకినాడలో మొట్ట మొదటి సారిగా , అందరికీ అందుబాటు ధరలో, డెంటల్ ఇంప్లాంట్స్!

తక్కువ ఖర్చుతో ఇంప్లాంట్లు వేయించుకోవచ్చా?

ఇంప్లాంట్ లో రకాలు ఉంటాయి. ఐతే, కంపెనీ బట్టి, మరియు, ఇంప్లాంట్ పైన వచ్చే వివిధ రకాల పోరలను బట్టి ఇంప్లాంట్ యొక్క ధర నిర్ణయించబడుతుంది.

కావున మీ దంత వైద్యుడు ఎటువంటి ఇంప్లాంట్స్ వాడుతున్నారు తెలుసుకోండి. వాటి ధర తెలుసుకోగలరు. వాటిల్లో తక్కువ ధరకు వచ్చే ఇంప్లాంట్స్ ఎంచుకోగలరు. ఐతే గమనించవలసింది ఏమిటంటే, ఖర్చు బట్టి నాణ్యత కూడా వస్తుంది.  

ఒకవేళ మీరు మొత్తం పళ్ళు కట్టించుకోవాలనుకుంటే, మీరు ఖర్చు తగ్గించుకోవటానికి ఒక ఉపాయం ఉంది. మొత్తం పళ్ళు కట్టడానికి (ఒక దవడ మీద), 6 నుండి 8 ఇంప్లాంట్లు అవసరం పడవచ్చు.

ఒకవేళ ఖర్చు ఎక్కువ అవుతుంది అనుకుంటే, మీరు అవే పళ్ళను 4 ఇంప్లాంట్ల మీద కట్టవచ్చు. దీనిని all on 4 టెక్నిక్ అంటారు. దీని వలన ఖర్చు తగ్గుతుంది.

 

లేదు, అంత ఖర్చు పెట్టలేము అనుకున్నవారు, కేవలం రెండు ఇంప్లాంట్లు మీద మొత్తం పళ్ళను కట్టించుకోవచ్చు. దీనిని ఓవర్ డెంచర్ (over denture) అని అంటారు.  

 

ఇంప్లాంట్ చికిత్స చేయించుకోవటానికి ఖర్చు ఎంతవ్వుతుంది?

తెలుసుకోవటానికి సంప్రదించండి sai krishna dental care & implant center | military road| bhanugudi jn | kakinada |ap

Discover more from SAI KRISHNA DENTAL CARE & IMPLANT CENTER | BEST DENTAL CLINIC IN KAKINADA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Scroll to Top