ఖైని, గుట్కా, పాన్, పొగాకు మొదలైనవి నోటికి హానికరం. వీటివల్ల నోటిలో చాలా మార్పులు వస్తాయి. మన భారత దేశంలో ఎక్కువ మంది చనిపోవడానికి కారణం అవుతున్న రెండో అతిపెద్ద క్యాన్సర్: నోటి క్యాన్సర్ (oral cancer).


అందువలనే మన ప్రభుత్వం దీనికి ప్రాధాన్యం ఇస్తూ ప్రతి సిగరెట్ ప్యాకెట్ పైన, మరియు ఖైని, జరదా, పాన్ ప్యాకెట్ల పైన క్యాన్సర్ బొమ్మలు ముద్రించాలని ఆదేశించింది.
ఈ అలవాటు మొదట్లో ఆహ్లాదాన్ని మరియు స్నేహితుల ప్రోత్సాహంతో మొదలవుతుంది. మెల్లగా వ్యసనంగా మారుతుంది.
వ్యసనంగా మారిన తెరువతా వీటిని తినకపోతే మనిషి ఒత్తిడికి (stress) లోనవుతాడు. వీటిని తినకుండా ఏ పని చేయలేడు మరియు ఆలోచనా శక్తి తగ్గిపోతుంది.
ఇది వ్యసనంగా ఎందుకు మారుతుంది:
ఖైని మరియు గుట్కా వంటి పదార్ధాలలో నికోటిన్ (nicotine) అనే రసాయనం ఉంటుంది. ఇది మెదడును హాయి పరుస్తుంది (CNS stimulant).
మెరుగైన నోటి ఆరోగ్యానికి మొదటి అడుగు వేయండి!
నోటి ఆరోగ్యంపై చిట్కాలను పొందండి మరియు మీ దంత ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మార్గాలను కనుగొనండి. ఈరోజే సైన్ అప్ చేయండి
అంటే ఎక్కువ సార్లు మనం దీనిని తినడం వలన మెదడు ఈ పదార్ధాలకు అలవాటు పడిపోతుంది. తినకపోతే మెదడుకు నికోటిన్ సరఫరా ఆగిపోయి నీరసపడిపోతాడు.
ఇది ఒకరకమైన వ్యసనం లాంటిదే!
అసలు ఇవి నోటిలో ఎలాంటి మార్పులు తీసుకొస్తాయి:
ఖైని, పాన్ మొదలైనవి వక్క, సున్నం, పొగాకు మొదలైన పదార్ధాలలో తయారు చేయబడినవి. వీటిని మొదట కాసేపు నవిలి బుగ్గలో పెట్టుకుంటారు.
సున్నం బుగ్గ మరియు నోటి చర్మాన్ని గాయ పరుస్తుంది. వక్క ముక్కలు తినేటప్పుడు బుగ్గకు రాపిడి పుట్టించి చిన్న చిన్న పుళ్ళను చేస్తాయి.
పొగాకు మరియు ఇతర పదార్ధాలు క్యాన్సర్ కారక రసాయనాలను విడుదల చేస్తాయి. ఇవి ఈ పుళ్ళలో నుంచి రక్తంలోకి వెళ్తాయి.
ఎక్కువ రోజులు వీటిని తినడం వలన మెల్లగా నోటిలో తెల్ల లేదా ఎరుపురంగు మచ్చలు వస్తాయి. ఇవే క్యాన్సర్కు ముందు వచ్చే లక్షణాలు (pre malignant lesions).
వీటిని leukoplakia మరియు erythroplakia అని అంటారు. వీటిని మొదట్లోనే చికిత్స చేయించుకోవడం మంచిది.
బుగ్గలో అదే పనిగా ఖైని లేదా జరదా పెట్టుకోవటం వలన బుగ్గలో ముడతలు మరియు తెల్ల మచ్చలు వస్తాయి, వీటిని tobacco pouch keratosis అని అంటారు. వీటిని సరైన సమయములో చికిత్స చేయించకపోతే మెల్లగా నోటి చర్మం గట్టిపడిపోతుంది.
నోరంతా తెల్లగా పాలిపోయిన రంగులోకి మారిపోతుంది. దీనిని oral submucous fibrosis అని అంటారు. దీనివలన నోరుతెరవడం క్రమేపి తగ్గిపోయి మనిషి నోరు తెరవలేకపోతాడు.
నోటిలో మార్పులను ఎలా గుర్తించాలి:
పైన చెప్పిన వాటిని తింటున్నవారిలో మార్పులను ఇలా పసిగట్టా వచ్చు:
- తెల్ల లేదా ఎర్రటి మచ్చలు
- ఖైని బుగ్గలో పెట్టుకున్న చోట తెల్లటి మచ్చలతో కూడిన ముడతలు కనిపించటం
- కారం తినలేకపోవటం
- నోరు తెరవలేక పోవటం
- బుగ్గ గట్టిపడటం
- నాలుక చాపలేకపోవటం మొదలైనవి…..
వీటిలో ఏ ఒక్కటి గమనించిన వెంటనే మీ దంత వైద్యుడిని సంప్రదించండి, లేదా oral medicine specialist ని సంప్రదించని.
వీటికి చికిత్స ఉందా?
ఇటువంటి మార్పులను ముందుగానే పసిగడితే మందుల ద్వారా క్యాన్సర్ క్రింద మారకుండా అపవచ్చు. కావున prevention is better than cure.
ఈ వ్యసనాలనుండి మానటానికి కౌన్సిలింగ్ సెంటర్లు కూడా ఉన్నాయి. ముందు వ్యాధి ఏ దశలో ఉందొ నిర్ధారించాలి. ఒక్కోసారి ముక్క పరీక్ష చేయాల్సివస్తుంది.
తెరువాత దానికి తగ్గ వైద్యం చేయించుకోవాలి. అన్నిటికన్నా ముందు ఖైని మొదలైనవి తినే అలవాట్లు మానుకోవాలి.మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది.
కావున ఇటువంటి వ్యసనాలకు పోకుండా జాగ్రత్త పడండి. తెలియని వారికి వీటిగురించి చెప్పి హెచ్చరించండి. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించండి.
ఈ వ్యాసం మీకు నచినట్లయితే నలుగురికి share చేయండి.