రూట్ కెనాల్ తెరువాత పన్ను నెప్పి వస్తే ఏం చేయాలి?| Pain after root canal

చాల మందికి ఇది ఒక పెద్ద సమస్య. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తెరువాత పన్ను నెప్పి వస్తే ఏం చేయాలి?

Free Consultation for a Perfect Smile

braces

Unlock the perfect smile with a FREE Braces or Orthodontic Consultation Today. Limited spots are available! Don't miss this exclusive opportunity. Reserve your spot now for a confident, radiant smile! 😁✨ #SmileMakeoverDay #TransformYourSmile

  • arrow-right

    Experienced Orthodontist

  • arrow-right

    Personalised Treatment plans

  • arrow-right

    State-of-Art Technology

  • arrow-right

    Flexible payment (EMI) Plans


అసలు రూట్ కెనాల్ అంటే ఏమిటి?

మన పళ్ళు మూడు పొరలు కలిగి ఉంటాయి. బయట పోరని ఏనామేల్ అని అంటారు. రెండో పోరని డెంటీన్ అని అంటారు. మూడో మరియు పన్ను మధ్యలో ఉన్న దాన్ని పల్ప్ అని అంటారు. 

ఈ పల్ప్ లోనే నరాలు మరియు రక్త నాణాలు ఉంటాయి.
పిప్పి పన్ను మధ్య భాగమైన పల్ప్ని [pulp] తాకగానే మనకు నెప్పి వస్తుంది. ఎప్పుడైతే పన్ను నరం దాకా ఈ పిప్పి వ్యాపిస్తుందో అప్పుడు మనకు నెప్పి ఎక్కువగా వస్తుంది.
అంటే పిప్పి వలన మన నరాలు రక్త నాణాలు ఉన్న చోటు అంట పడిపోయింది అన్నమాట.అప్పుడు చేసే చికిత్సనే రూట్ కెనాల్ అంటారు. ఈ చికిత్సలో పడైపోయిన నరాలను తెసేవేసి వేరొక పదార్ధముతో ఫిల్ చేస్తారు.

అసలు రూట్ కెనాల్ తెరువాత నెప్పి ఎందుకు వస్తుంది?

దీనికి చాల కారణాలు ఉన్నాయి.

  1. రూట్ కెనాల్ అనేది పన్ను వేరు మొదలు దాక చేస్తాము. పన్ను వేరు దాటి బయటకు చేయము. కానీ పిప్పి పన్ను లో ఇన్ఫెక్షిన్ పన్ను వేరు బయట కూడా ఉంటుంది. అందువలన, రూట్ కెనాల్ చేసిన తెరువాత కూడా కొంత మందిలో నెప్పి రావటం సహజం. ఈ నెప్పి ఒక వరం రోజుల దాక ఉండవచ్చు.
  2. ఒక్కోసారి ఇన్ఫెక్షిన్ ఎక్కువగా ఉన్నపుడు రూట్ కెనాల్ పూర్తీ చేసిన యెడల ఇన్ఫెక్షిన్ పూర్తిగా తగ్గక పోవటం జరుగుతుంది, అప్పుడు మనకు రూట్ కెనాల్ చేసిన తెరువాత కూడా నెప్పి రావచ్చు.
  3. పిప్పి రెండు పళ్ళ మధ్యలో వచ్చి మనం, ఒక పన్నుకే రూట్ కెనాల్ చేయిన్న్చుకున్న యెడల, నెప్పి తగ్గక పొవచు.
  4. రూట్ కెనాల్ పూర్తీ అయిపోయిన తెరువాత పైన పెట్టె ఫిల్లింగ్ ఎత్తుగా ఉన్నపుడు కూడా రూట్ కెనాల్ పన్ను నెప్పి రావచు.
  5. రూట్ కెనాల్ చేసిన పన్ను పైన క్యాప్ వేయించుకున్న యెడల, అది ఎత్తుగా ఉన్నచో, అప్పుడు కూడా నెప్పి రావచు.

పన్ను నెప్పి వచిన్నపుడు ఏం చేయాలి?

రూట్ కెనాల్ చేయించుకొన్న తెరువాత పన్ను నెప్పి వస్తే ఈ క్రింది విధముగా చేయాలి:

మెరుగైన నోటి ఆరోగ్యానికి మొదటి అడుగు వేయండి!

నోటి ఆరోగ్యంపై చిట్కాలను పొందండి మరియు మీ దంత ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మార్గాలను కనుగొనండి. ఈరోజే సైన్ అప్ చేయండి

Subscribe to Blog via Email

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.


  1. రూట్ కెనాల్ చేసిన తెరువాత పన్ను నెప్పి కొంతమందిలో సహజం గానే వస్తుంది. ఒకవేళ నెప్పి తక్కువగా మరియు భరించగలిగే లా ఉంటె కొన్నాళ్ళు నెప్పి మాత్రలు వాడితే సరిపోతుంది. ఇటువంటి నెప్పి సహజంగా ఒక వారంలో తగ్గిపోతుంది.
  2. వరం తెరువాత కూడా నెప్పి వస్తుంటే, ముందు మీరు మీ దంత వద్యుడిని సంప్రదించటం ఉత్తమం.
  3. లేదా తోలి రోజుల్లోనే నెప్పి చాల ఎక్కువగా వస్తుంటే, తక్షణం దంత వైద్యుడిని సంప్రదించండి.
  4. మీ దంత వద్యుడు, పరిక్షలు జరిపిన పిదప, పన్ను నోప్పికి గల కారణాలు అన్వేషించి, ఉత్తమమైన సొల్యూషన్ చెప్పగలరు.

రూట్ కెనాల్ చేసిన తెరువాత పన్ను నెప్పి ఎక్కువగా వస్తే ఏం చేయాలి?

రూట్ కెనాల్ తెరువాత పన్ను నెప్పి ఎక్కువగా వస్తే, మీ దంత వైద్యడు ఈ విధముగా చేయవచ్చు.

  1. రూట్ కెనాల్ పైన ఉన్న ఫిల్లింగ్ మరలా సరిచేయవచ్చు.
  2. రూట్ కెనాల్ మరలా చేయవచ్చు.
  3. లేదా పన్ను తిసి వేయవచ్చి.

అన్ని రూట్ కేనల్స్ సుకెస్స్ అవ్వక పూవాచు. నూటికి ౩% నుండి 5% రూట్ కేనల్స్ ఫెయిల్ అవ్వటానికి ఆస్కారం ఉన్నాయి.

రూట్ కెనాల్ తెరువాత తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి?

  1. కొనాళ్ళు గట్టి పదార్ధాలు ఆ పళ్ళతో నవలకోడదు.
  2. పళ్ళు శుభ్రంగా ఉంచుకోవలెను.
  3. తీపి పదార్ధాలకు దూరంగా ఉండవలెను.
  4. రూట్ కెనాల్ చేసిన పన్ను సహజం గానే బలహీనంగా ఉంటుంది. అందువలన పన్ను పైన తొడుగు [క్యాప్] వేయించుకోవటం ఉత్తమం.

రూట్ కెనాల్ పన్ను పైన తొడుగు ఎప్పుడు వేయించుకోవాలి?

ఇది చాల మంచి ప్రశ్న. రూట్ కెనాల్ చేసిన తెరువాత ఒక వరం పన్నుని పరీక్షించాలి.
ఎటువంటి నెప్పి వచ్చిన వెంటనే దంత వైద్యుడిని సంప్రదించాలి.
వరం రోజుల తెరువాత ఎటువంటి నెప్పి రాలేదు అని నిర్ధారించుకున్న తెరువతనే పన్ను పైన తొడుగు వేయించుకోవాలి.

రూట్ కెనాల్ చేయించుకోవాల? లేదా పన్ను తీయిన్చుకోవాలా?

ఇది మీ దంత వైద్యుడు నిర్ణయిస్తారు. పన్నుని సాధ్యమైనంత వరకు కాపాడుకోవతనికే చుసుకోకాలి. అది సాధ్యం కాని యెడల, పన్ను తెయించుకోవాలి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Discover more from SAI KRISHNA DENTAL CARE & IMPLANT CENTER | BEST DENTAL CLINIC IN KAKINADA

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Scroll to Top