రూట్ కెనాల్ (Root canal) అనే పదం మీరు చాలా సార్లు విని ఉంటారు. మీరు కానీ మీ కుటుంబసభ్యులలో ఎవరన్నా రూట్ కెనాల్ చేయించుకుని ఉంటారు. ఐతే చాలా మందికి రూట్ కెనాల్ అంటే తెలవకపోయి ఉండవచ్చు. దాని గురించి సమగ్రంగా ఈరోజు తెలుసు కుందాము.
రూట్ కెనాల్ ఎప్పుడు చేస్తారు?
మన పంటిలో, మూడు పొరలు ఉంటాయి. వాటినే,
- Enamel (ఏనామెల్)
- Dentin (డెంటిన్)
- Pulp (పలప్)
అని అంటారు.
పిప్పి అనేది, పంటిలో పాడై పోయిన భాగం. ఐతే ఇది మొదటి లేదా రెండో పొర (అనగా enamel లేదా dentin దగ్గరకు వస్తే, మామూలు సిమెంట్ పెడితే సరిపోతుంది.
కానీ ఈ పిప్పి ఒక్కసారి, రెండో పొర దాటి, మూడో పొర వరకు వస్తే, పన్ను నెప్పి ఎక్కువవుతుంది. అంతేకాదు, నెప్పి చాలా ఎక్కువగా వస్తుంది. మరియు అన్నం తినేటప్పుడు మరియు నిద్ర పోయేటప్పుడు నెప్పి ఎక్కువవుతుంది.
మెరుగైన నోటి ఆరోగ్యానికి మొదటి అడుగు వేయండి!
నోటి ఆరోగ్యంపై చిట్కాలను పొందండి మరియు మీ దంత ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మార్గాలను కనుగొనండి. ఈరోజే సైన్ అప్ చేయండి
అటువంటి సమయంలో, పన్ను రూట్ కెనాల్ చేయించుకోవాల్సి వస్తుంది.
రూట్ కెనాల్ ఎందుకు చేస్తారు?
మన పంటి మూడో పొరలో (అనగా pulpలో) నరాలు రక్త నాణాలు ఉంటాయి. అవే మన పంటికి, బలాన్ని, మరియు స్పర్శని ఇస్తాయి.
ఐతే, పిప్పి ఎప్పుడైతే ఈ మూడో పొరని తాకుతుంది, అప్పుడు, వాటిలో ఉన్న నరాలు మరియు రక్త నాణాలు పాడవటం మొదలవుతుంది.
ఒక్కసారి, ఈ ప్రక్రియ మొదలైతే అది ఆపడం అసాధ్యం. అటువంటి సమయంలో, మనం మూడో పొరని (అనగా pulpని) సమూలంగా తీసివేయవలసి వస్తుంది. అలా కాకుండా, మూడో పొరని కదపకుండా, కేవలం పిప్పి తీసి, పన్ను మీద సిమెంట్ పెట్టిన యెడల, మీకు నెప్పి ఇంకా పెరిగే ఆస్కారం ఉంటుంది.
అందువలన, పిప్పి మూడో పొర దాకా వచ్చిన యెడల, సిమెంట్ కన్నా రూట్ కెనాల్ చేయించుకోవటం ఉత్తమము.
రూట్ కెనాల్ ఎలా చేస్తారు?
రూట్ కెనాల్ అనే ప్రక్రియ, మొత్తం, మూడు భాగాలలో చేస్తారు. అనగా మీరు మూడు సార్లు రావలసి వస్తుంది.
మొదటి సిట్టింగు
మొదటి రోజు, పన్ను మీద ఉన్న పిప్పి తొలగిస్తారు. మరియు పంటిలో ఒక రంధ్రం చేసి, పాడై పోయిన మూడో పొరను (అనగా pulpను) మొత్తం తొలగిస్తారు. దీనికి, 15 నుండి 20 నిమిషముల సమయం పడుతుంది.
తరువాత ఒకటి లేదా రెండు రోజులు విరామం ఉంటుంది.
రెండవ సిట్టింగు
రెండవ సిట్టింగు, ఒకటి లేదా రెండు రోజుల తరువాత ఉంటుంది. ఈ సిట్టింగ్ లో, పంటి లోని, మూడవ పొర ఉన్న భాగాన్ని కొద్దిగా పెంచుతారు. దానినే, bmp అని అంటారు. ఈ రెండు రోజుల సమయం లో పంటి క్రింద ఉన్న ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుంది.
రెండవ సిట్టింగ్, 5 నుండి 10 నిమిషాలలో పూర్తవుతుంది.
మూడవ సిట్టింగు
మూడవ సిట్టింగ్ ను obturation అని అంటారు. ఈ సిట్టింగులో ఖాళీగా ఉన్న పన్ను మూడవ పొరను, Gutta Percha అనే పదార్ధముతో నింపుతారు. మరియు, పన్ను పైన సిమెంటు పెడతారు.
ఈ ప్రక్రియ కూడా, 15 నుండి 20 నిమిషాలు పడుతుంది. అవసరమైతే, మధ్యలో ఒక x-ray కూడా తీస్తారు. ఇంతటితో, రూట్ కెనాల్ పూర్తయిన ట్లే.
రూట్ కెనాల్ పన్ను పైన తొడుగు (క్యాప్) ఎప్పుడు వేయించుకోవాలి?
రూట్ కెనాల్ పూర్తయిన వారం వరకు క్యాప్ వేయించుకొకపోవటం, ఉత్తమం. ఎందుకంటే, రూట్ కెనాల్ ఐనా తరువాత పన్ను నెప్పి ఎలా ఉంది, మరియు పన్ను ఎలా పని చేస్తుంది, చూడటానికి, ఒక వారం సమయం పడుతుంది.
ఈ లోపల, పన్ను మరలా సలుపు వస్తుందా, లేదా ఇన్ఫెక్షన్ మరలా వచ్చే అవకాశం ఉందా అన్న ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. ఒకవేళ, పైన చెప్పినట్టుగా నెప్పి కానీ ఇన్ఫెక్షన్ కానీ మరల వస్తే, మరల రూట్ కెనాల్ చేసే అవకాశం ఉంటుంది. ఐతే క్యాప్ ఒకసారి వేస్తే, ఈ సౌకర్యం అనగా మరలా రూట్ కెనాల్ చేసే సౌకర్యం ఉండదు.
అందువలన రూట్ కెనాల్ చేసిన ఒక వారం తరువాతే క్యాప్ గురించి ఆలోచించండి. తొందరపడి, ముందుగానే క్యాప్ వేయించు కోవటం సరైన పద్ధతి కాదు.
సింగల్ సిట్టింగ్ రూట్ కెనాల్ (Single Sitting Root Canal) అంటే ఏంటి?
ఒకే సిట్టింగు లో రూట్ కెనాల్ మొత్తం పూర్తి చేయటాన్ని, సింగల్ సిట్టింగ్ రూట్ కెనాల్ అని అంటారు.
ఐతే, ఇది అందరికీ చేయలేము మరియు చేయకూడదు. ఉదాహరణకి, ఎవరికన్నా, క్యాప్ పెట్టడం కోసం రూట్ కెనాల్ చేయవలసి వస్తే, అప్పుడు సింగల్ సిట్టింగ్ రూట్ కెనాల్ చేయవచ్చు.
అలాగే, అనుకోకుండా, ఆక్సిడెంట్ లో పళ్ళు కోల్పోయినట్లయితే, వారికి కూడా ఈ ట్రీట్మెంట్ చేయవచ్చు. కానీ, వారి ఆక్సిడెంట్ అయ్యిన రోజే, మా దగ్గరకు రావలసి వస్తుంది. అనగా, ఇన్ఫెక్షన్ లేని పన్నుకు సింగల్ సిట్టింగ్ రూట్ కెనాల్ చేయవచ్చు.
ఇన్ఫెక్షన్ ఉన్న యెడల, ఆ ఇన్ఫెక్షన్ తగ్గడానికి, సమయం పడుతుంది కాబట్టి, అక్కడ సింగల్ సిట్టింగ్ రూట్ కెనాల్ పని చేయక పోవచ్చు. అటువంటి అప్పుడు, మూడు సిట్టింగులలో, రూట్ కెనాల్ చేయవలసి వస్తుంది.
మీ పన్నుకు రూట్ కెనాల్ చేయించుకోవాలని అనుకుంటున్నారా? ఐతే మమ్ములను సంప్రదించండి. రూట్ కెనాల్ కు సంబంధించి మరిన్ని వివరముల కొరకు వెంటనే ఈ నంబరుకు కాల్ చేయండి.
రూట్ కెనాల్ చేసే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
రూట్ కెనాల్ చేసే సమయంలో పన్ను చాలా సున్నితంగా ఉంటుంది. అందువలన రూట్ కెనాల్ చేసే సమయంలో,
- పన్ను పైన గట్టి పదార్ధాలతో కొరకరాదు. అలా కొరికనట్లయితే పన్ను ఒత్తిడికి లోనై నెప్పి ఎక్కువగా వస్తుంది.
- రూట్ కెనాల్ పూర్తయ్యేవరకు, మెత్తటి పదార్ధాలతో తినవలెను.
- మందులు క్రమం తప్పకుండా వాడవలెను. మందులు పంటి క్రింద ఉన్న ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తాయి. పన్ను నెప్పి తగ్గటానికి సహాయపడతాయి.
- రూట్ కెనాల్ ఐనా ఒక వారం తరువాత ఖచ్చితంగా క్యాప్ వేయించుకోండి. రూట్ కెనాల్ ఐనా పన్ను తన బలాన్ని కోల్పోతుంది. మరియు స్పర్శ కూడా ఉండదు. దానివలన, మెత్తటి మరియు గట్టి పదార్ధాలను ఒకే లాగా నవలవలసి వస్తుంది. అటువంటప్పుడు, పంటి మీద క్యాప్ ఉంటే, అది గట్టి పదార్ధాలనుండి, మీ పన్నును కాపాడుతుంది.
రూట్ కెనాల్ కన్నా పన్ను తీయించుకోటం ఉత్తమమా?
సాధ్యమయినంతవరకు మన పళ్ళను కాపాడుకోవటానికే చూసుకోవాలి. ఎందుకంటే, ఎంతటి ఖరీదైన కృత్రిమ పెళ్ళయిన మన సహజ పళ్ళకి సరిసమానము కాలేవు.
అందువలన, మొదట మీ పళ్ళను కాపాడుకోటానికి చూసుకోండి. ఒకవేళ మీ దంత వైద్యుడు అది కుదరదు అని చెప్పిన యెడల, మీరు పళ్ళు తీయించుకోటానికి సిద్ధపడండి.
మీ పన్నుకు రూట్ కెనాల్ చేయించుకోవాలని అనుకుంటున్నారా? ఐతే మమ్ములను సంప్రదించండి. రూట్ కెనాల్ కు సంబంధించి మరిన్ని వివరముల కొరకు వెంటనే ఈ నంబరుకు కాల్ చేయండి.