చాలా మందికి పళ్ళు క్లీన్ చేయటానికి మరియు పళ్ళు వైటెనింగ్ (teeth whitening) చేయించుకోవటం మధ్య తేడా తెలీదు. ఈ వ్యాసంలో టీత్ క్లీనింగ్ మరియు వాటి రకాలగురించి తెలుసుకుందాం.
అసలు పళ్ళు ఎందుకు క్లీన్ చేయించుకోవాలి?
సాధరంమగా మనము రోజు బ్రష్ చేసుకుంటాం కదా, ఐనా పల్లి దంత వైద్యుని దేగ్గర ఎందుకు క్లీన్ చేయించుకోవాలి? ఇది అందరికీ వచ్చే సాధారణ ప్రశ్న. మీకు కూడా ఈ అనుమానం వచ్చి వుండవచ్చు.
మనం వాడే బ్రష్ పంటి యొక్క ఎక్కువ భాగాలను శుభ్రపరుస్తుంది. కానీ, అన్నీ భాగాలను కాదు. పైగా, మనం మేలుకువగా ఉన్నప్పుడూ మన నోటిలోని లాలాజలం, మన నోటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుతుంది.
కానీ మనం నిద్రిస్తున్నప్పుడు మన నోటిలో లాలాజలం ఎక్కువగా ఉండదు. ఈ సమయంలో మనం తిన్న పదార్ధాలు నోటిలో కనుక ఉంటే, అవి మన పళ్ళకు అతుక్కుని గట్టిపడతాయి. ఉదయనికల్లా, అవి గార క్రింద మారి మన పళ్ళకు గట్టిగా అతుక్కుపోతాయి.
ఈ గార మన బ్రష్ తో పోదు. అంతే కాకుండా, ఒకసారి పళ్ళకు గార పట్టడం మొదలైతే, అది నిరంతరం పెరుగుతూనే ఉంటుంది. అంత సులభంగా పోదు.
మెరుగైన నోటి ఆరోగ్యానికి మొదటి అడుగు వేయండి!
నోటి ఆరోగ్యంపై చిట్కాలను పొందండి మరియు మీ దంత ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మార్గాలను కనుగొనండి. ఈరోజే సైన్ అప్ చేయండి
అటువంటి సమయంలో, డెంటల్ క్లీనింగ్ ఉత్తమమైనది.
పళ్ళు క్లీన్ చేయించుకోకపోతే వచ్చే సమస్యలు ఏంటి?
మన చిగుళ్లు పంటిని అంటిపెట్టుకుని ఉంటాయి. పంటికి గార పట్టడం వలన చిగురు వాపులు వస్తాయి. కానీ వీటివల్ల మరికొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి.
గార పంటికి మరియు చిగురుకి మధ్య పడుతుంది. అందువలన, గార పెరిగినప్పుడల్లా, చిగురు క్రింద కి జారుతూ ఉంటుంది. ఇక్కడి వరకు విషయం బానే ఉంది అనుకుంటున్నారేమో, ఇక్కడే అసలైన సమస్య మొదలవుతుంది.
చిగురు క్రింద మన బోణికే (Bone) ఉంటుంది. చిగురుకి మరియు ఎముకకి మధ్య ఉండే దూరం ఎప్పుడు నిలకడగా ఉంటుంది. దానినే biological width అని అంటారు. అంటే చిగురు క్రింద కి వెళితే ఎముకకూడా క్రింద కి అరుగుతుంది.
ఐతే ఒకసారి గార పట్టే క్రమాన్ని అర్ధం చేసుకుందాం.
గార ఎక్కువగా పడితే, చిగురు ఎక్కువగా క్రింద కి జారుతుంది. చిగురు ఎక్కువగా జారితే, పళ్ళ చుట్టూ ఉండే ఎముక ఎక్కువగా అరుగుతుంది. ఎముక ఎక్కువగా అరిగితే, మన పళ్ళు త్వరగా కదలటం మొదలవుతాయి.
అందువలన పళ్ళు మీ దంతవైద్యుని ద్వారా క్లీన్ చేయించుకోవటం ఉత్తమం.
ఎన్ని సార్లు పళ్ళు క్లీన్ చేయించుకోవచ్చు?
ఐతే పళ్ళు ఎన్నిసార్లు క్లీన్ చేయించుకోవాలనే దాని పైన చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. సాధారణంగా ఇది మనిషి మనిషికి మారుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇది మన లాలాజలం యొక్క కూర్పు బట్టి ఉంటుంది.
కొంత మందికి గార త్వరగా పట్టదు. అటువంటి వారు సంవత్సరానికి ఒక్కసారి చేయించుకుంటే సరిపోతుంది. మరి కొందరికి గార కొంత ఎక్కువగానే ఉంటుంది. అటువంటి వారు 6 నెలల కి ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది.
కొంత మందికి, గార చాలా త్వరగా పడుతుంది. అటువంటి వారు కనీసం 3 నెలల కొసరి చేయించుకోవటం మంచిది.
పళ్ళ క్లీనింగ్ ఎన్ని రకాలు?
మనలో చాలామందికి ఇవి ఎన్ని రకాలో తేలేదు. అందువలన వాటిగురించి మొదట తెలుసుకుందాం. మన అలవాట్లు మరియు చిగుళ్ల యొక్క వాపులు బట్టి ఎటువంటి క్లీనింగ్ చేయించుకోవాలో మన దంత వైద్యుడు నిర్ధారిస్తారు.
చిగురు పైన క్లీన్ చేయటం (supra gingival cleaning)
ఆరంభ దశలో గార పళ్ళ పై భాగానే ఉంటుంది. చిగురు క్రింద కు వెళ్ళాడు. అటువంటప్పుడు, చిగురు పై భాగాన ఉన్న గారను తీసేస్తే సరిపోతుంది.
దీనిని చిగురు పైన క్లీన్ చేయడం అంటారు.
చిగురు క్రింద క్లీన్ చేయటం (sub gingival cleaning) / Curettage / Root planning
ఒకవేళ చిగురు పైన ఉన్న గారను అట్టే వదిలేస్తే, అది చిగురు క్రింద కు కూడా వెళుతుందు. అటువంటప్పుడు, చిగురు పై భాగాలను మొదట క్లీన్ చేస్తారు.
తరువాత, చిగుళ్లకు మత్తు ఇచ్చి చిగురు క్రింద ఉన్న గారను సున్నితంగా చిగురుకు దెబ్బ తగలకుండా తీస్తారు. దీనిని curettage and root planning అని అంటారు.
ఫ్లాప్ సర్జరీ (Flap Surgery)
ఒకవేళ గార బాగా ఎక్కువగా ఉంది, చిగురు వాపులు ఎక్కువగా ఉన్న ఎడల, వారికి బోణికే / ఎముక ఎంతవరకు తగ్గింది అనేది, ఒక x-ray తీసి నిర్దారిస్తారు.
అటువంటి వారికి, చిగురును, సర్జరీ చేసి పక్కకి తీసి, క్రింద ఉన్న పన్ను వేరు (root) భాగాన్ని శుభ్ర పరుస్తారు. ఒకవేళ ఎముక బాగా పోయినట్టు గుర్తిస్తే, కృత్రిమ ఎముకను అక్కడ అమరుస్తారు.
దీనిని ఫ్లాప్ (flap) సర్జరీ అంటారు. ఈ చికిత్స ఒకటి లేదా రెండు సిట్టింగ్లలో చేస్తారు.
పాలిషింగ్
పాలిషింగ్ మరియు క్లీనింగ్ రెండు, వేరు పద్ధతులు. పాలిషింగ్ అనేది, క్లీనింగ్ తో పాటు లేదా, క్లీనింగ్ తరువాత చేస్తారు.
ఉదాహరణకి, బాగా మట్టి పట్టిన షూ (shoe) ని తడి గుడ్డతో తుడవడాన్ని క్లీనింగ్ అంటారు. అదే పాలిష్ తో బాగా రుద్దడాన్ని, పాలిషింగ్ అంటారు.
అదే విధంగా, క్లీనింగ్ చేసిన పళ్ళను, ఒక పేస్ట్ తో బాగా పాలిష్ చేస్తారు. ఈ పద్ధతిని పాలిషింగ్ అంటారు. ఇది గార ఎక్కువగా ఉన్నవారు చేయించుకోవటం చాలా మంచిది.
పాలిషింగ్ చేయటం వలన గార మరలా త్వరగా పట్టదు.
బ్లీచింగ్(Bleaching) / టీత్ వైటెనింగ్ (Teeth Whitening)
బ్లీచింగ్ మరియు క్లీనింగ్ అనే రెండు, భిన్నమైన పద్ధతులు. చాలామంది, ఇవి రెండు ఒకటేనని భ్రమ పడుతుంటారు.
క్లీనింగ్ అంటే, పళ్ళను శుభ్రం చేయటం, లేదా గారను తీసివేయటం.
బ్లీచింగ్ అంటే, పంటి రంగును తెల్ల గా చేయటం. బ్లీచింగ్ చేయటం వలన మన పళ్ళు తెల్ల గా అవటానికి ఆస్కారం ఉంటుంది.
కానీ బ్లీచింగ్ ఎక్కువ గా చేయించుకోవటం వలన కొన్ని అనర్థాలు కూడా ఉన్నాయి. వీటిలో మొదటిది, పళ్ళలో రంధ్రాలు పడటం. బ్లీచింగ్ వలన పళ్ళలో రంధ్రాలు పడి, జువ్వుమని లాగే తత్వం పెరుగుతుంది.
రెండోది, బ్లీచింగ్ అందరికి అవసరం ఉండదు.
పళ్ళు క్లీనింగ్ తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు?
పళ్ళు క్లీనింగ్ తరువాత ఇవి తప్పనిసరిగా గుర్తుంచుకోండి.
- పళ్ళు క్లీనింగ్ తరువాత జుమ్మని లాగే తత్వం, లేదా పళ్ళ సలుపులు కొంచం ఎక్కువవుతాయి. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఇవి ఎక్కువ రోజులు ఉండవు. ఇవి చాలా కొద్ది మందిలోనే కనిపిస్తాయి.
- చిగురు వాపు ఎక్కువగా ఉన్న వారిలో క్లీనింగ్ చేసేటప్పుడు, రక్తం కొద్దిగా ఎక్కువగా వస్తుంది. ఇదే చిగురు వాపులు ఎక్కువగా ఉన్నాయనటానికి నిదర్శనం.
- క్లీనింగ్ చేయించినతేరువాత, పళ్ళ మధ్య కాళీలు వచ్చినట్టు అనిపించటం సహజం. ఈ ఖాళీలు రెండు రోజులలో, చిగురుతో మూయబడతాయి. చిగురు ఈ ఖాళీలలో పెరిగి, వాటిని మూసి వేస్తాయి.
- క్లీనింగ్ తరువాత పళ్ళు గరుగ్గా ఉన్నట్టు అనిపించటం సహజం. ఇది కూడా ఒక రోజులో నయమవుతుంది. ఒకసారి లాలాజలం, మన పళ్ళపైన slime layer అనే పొరను తయ్యారు చేసిన తరువాత, ఈ గరుగుతనం పోతుంది. దీనికి ఒక రోజు పడుతుంది.
- గార ఎక్కువగా ఉన్నవారిలో ఎముక అరుగుదల ఎక్కువగా ఉంటుందని మనము ఇందాక తెలుసుకున్నాము కదా! అందువలన కొంత మందిలో క్లీనింగ్ తరువాత కొన్ని పళ్ళు కదులుతున్నట్టు అనిపిస్తాయి. ఇప్పటిదాకా గార ఉండటం వలన మనకు ఈ పళ్ళు కదులుతున్నట్టు తెలియలేదు. ఎముక ఎక్కువగా అరగని వారిలో, ఈ కదలికలు, రెండు లేదా మూడు రోజుల్లోనే ఆగిపోయి, పళ్ళు గట్టిపడతాయి. – ఇది సాధారణంగా 60 సంవత్సరాలు పై బడిని వారిలో కనిపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో , ఫ్లాప్ (Flap) సర్జరీ ద్వారా పళ్ళు కదలకుండా మరియు ఎముక ఇంకా పొడవకుండా చూసుకోవచ్చు.
- కొంత మందిలో, పళ్ళు పుట్టుకతోనే పచ్చగా ఉంటాయి. అటువంటి వారు, క్లీనింగ్ చేయించుకోవటం వలన పచ్చదనం పోదు.
పళ్ళ క్లీనింగ్ మరియు చిగురుకు సంబంధించిన ఎటువంటి సమస్యైనా మీరు మా క్లినిక్ ను సంప్రదించగలరు. మరిన్ని వివరాలకు ఈ క్రింద నంబరుకు కాల్ చేయగలరు. మా వద్ద చిగురుకు మరియు పళ్ళకు సంబంధించిన సమస్యలకు సత్వర పరిష్కారం కలదు.
మేము అందించే సేవలు:
- Dental Cleaning & Polishing
- Gingival Curettage and Root planning
- Flap surgery
- Bridal package for cosmetic dental cleaning and teeth whitening (Cosmetic dental package).