నేడు పన్ను తీయటం చాలా సులువైన ప్రక్రియ. నొప్పి లేకుండా పన్ను తీయటానికి చాలా రకాల పరికరాలు అందుబాటులో ఉన్నాయి.
కానీ పన్ను తీసిన తెరువాత సరైన జాగ్రత్తలు తీసుకోని యెడల మీరు మరికొన్ని ప్రమాదాలకు గురికావలసి వస్తుంది.
డ్రై సాకెట్ (Dry Socket)
వీటిల్లో మొదటిగా (dry socket) డ్రై సాకెట్ గురించి మాట్లాడుకోవాలి. పన్ను తీసిన చోట మరలా ఇన్ఫెక్షన్ వ్యాపిస్తే అది బోణికెను మరియు చుట్టూ ఉన్న చిగురును తినేస్తుంది.
అటువంటి సమయంలో మనకు తీవ్రమైన నెప్పి రావచ్చు. ఈ నెప్పి పన్ను ఉన్నప్పుడూ వచ్చినదానికన్నా రెండింతలు ఎక్కువగా ఉంటుంది. అంటే దాని ప్రభావం మనమీద ఎంత ఉంటుందో ఊహించవచ్చు కదా?
డ్రై సాకెట్ ఎక్కువగా షుగర్ పేషెంట్ లో వస్తుంది.
రక్తం ఆగక పోవటం
పన్ను తెసేటప్పుడు ఎక్కువ రక్తం పోవచ్చు. కానీ పన్ను తీసిన తెరువాత అక్కడ రక్తం గడ్డకట్టి రక్తం కారడం ఆగిపోతుంది. కానీ సరైన జాగ్రత్త టేసుకోకపోతే రక్తం కారడం ఆగక పోవచ్చు. ఇది చాలా ప్రమాదకరం.
మెరుగైన నోటి ఆరోగ్యానికి మొదటి అడుగు వేయండి!
నోటి ఆరోగ్యంపై చిట్కాలను పొందండి మరియు మీ దంత ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మార్గాలను కనుగొనండి. ఈరోజే సైన్ అప్ చేయండి
మొహంలో వాపు రావటం
పన్ను తీసినతేరువత కొంతమంది నొప్పి వస్తే జండుబామ్ లేదా అటుంవంటి మరో పదార్ధాన్ని అక్కడ రాస్తూ ఉంటారు. కానీ ఇది చాలా ప్రమాదకరం. ఇలా చేయటం వల్ల, మొహం మీద వాపు వచ్చే ప్రమాదం ఉంది.
చిగురు వాపు
పన్ను తీసినతేరువాత కొంత మందిలో చిగురు వాపు వచ్చే అవకాశం ఉంది. ఇది ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్నవారిలో సహజంగా కనిపిస్తుంది. క్ంతమంది పన్ను తీసినచోట భయంతో బ్రష్ సరిగ్గా చేయరు. అటువంటి వారిలో చిగురు వాపు ఎక్కువగా వస్తుంది. ఇది కొన్ని రోజుల్లోనే తగ్గిపోయే ఆస్కారం ఉంది.
ఐతే ఇటువంటి ఇబ్బందులనుండి మీరు సురక్షితంగా ఉండాలంటే ఈ క్రింది విధింగా చేయండి.
పన్ను తీసినతెరువాత మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు
పన్ను తీసిన తెరువాత ఒక అర్ధగంట వరకు దూది తీయరాదు:
దూది ఉంచటం వల్ల రక్తం త్వరగా గడ్డ కట్టి రక్తం కారడం ఆగిపోతుంది. ముందే దూది తీయటం వలన రక్తం ఎక్కువగా పోవటం జరుగుతుంది.
పన్ను తీసిన రెండురోజులవరకు ఉమ్ము బయటకి ఊయరాదు.
ఉమ్ము ఊసినప్పుడల్లా గడ్డ కట్టిన రక్తం బయటకు వచ్చి మరలా రక్తం కారడం జరుగుతుంది. అందువలన రెండు రోజులవరకు ఉమ్ము బయటికి ఊయరాదు.
వేలితో పన్ను తీసిన చోట తడమరాడు.
వేలితో తడమటం వలన ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యే ఆస్కారం ఉంది. పన్ను తీసిన చోట ఎటువంటి పరికరాలతో తడమకూడదు.
గ్యాస్ ఉన్న డ్రింకులు తాగరాడు.
గ్యాస్ ఉన్న డ్రింకులు , అనగా పెప్సి, కోకా కోలా లాంటివి, తాగటం వలన గడ్డకట్టిన రక్తం బయటకి వచ్చి మరలా రక్తం కారటం జరుగుతుంది. అందువలన పన్ను తీసిన తెరువాత గ్యాస్ ఉన్న డ్రింక్లు (carbonated drinks) తాగరాదు.
వేడి మరియు మసాలా పాదార్ధాలు తినరాదు.
వేడి మరియు మసాలా పాదార్ధాలు తిన్న యెడల పన్ను తీసినచోట నెప్పి రావచ్చు. అది మెమ్మల్ని ఇబ్బందికి గురిచేయవచ్చు.
అందువలన పన్ను తీసిన తెరువాత ఒక రోజు వరకు కారం ఎక్కువగా లేని చల్ల పదార్ధాలు తినటం మంచిది. అంటే మజ్జిగన్నం లాంటివి అనమాట.
మందులు తప్పనిసరిగా వాడవలెను
మందులు తప్పనిసరిగా వాడవలెను. పన్ను తీసిన తెరువాత కూడా మనలో కొంత ఇన్ఫెక్షన్ ఉండవచ్చు. అది పోవాలంటే మందులు తప్పనిసరిగా వాడవలెను. లేకపోతే పన్ను తీసినచోట నయమవ్వటానికి ఎక్కువ సమయం పట్టవచ్చు.
చాలామంది, పన్ను తీసిన రెండో రోజే, నెప్పి లేదుకదా అని మందులు వాడటం మానవచ్చు. కానీ ఇది సరైన పద్ధతి కాదు.
పై విధంగా చెప్పినవి గుర్తుంచుకొని పాటిస్తే, మీకు పన్ను తీసిన తెరువాత ఎటువంటి ఇబ్బంది కలగదు.
ఇంకా మీకు ఏమన్నా సందేహాలు ఉంటే మీరు online consultation ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు.